Tollywood : పర్సంటేజ్’ స్పెషల్ కమిటీ.. దిల్ రాజు, అల్లు అరవింద్ సహా నిర్మాతలు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రధాన సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించేలా కనిపిస్తోంది. పర్సంటేజ్ సిస్టమ్’ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా శుక్రవారం (మే 15, 2026) హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని ఛాంబర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ మూడు వర్గాల సభ్యులతో అత్యవసరంగా ఒక జాయింట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన పర్సంటేజీల విధానంపై లోతైన చర్చలు జరిగాయి. లాభనష్టాల పంపకాల విషయంలో ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఈ భేటీలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సున్నితమైన వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చే బాధ్యతను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు తమ భుజాలపై వేసుకున్నారు. సమస్యను లోతుగా అధ్యయనం చేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి రావడం కోసం ఫిల్మ్ ఛాంబర్ ఒక ప్రత్యేక ‘సబ్-కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఛాంబర్ ప్రెసిడెంట్ డి. సురేష్ బాబు ఛైర్మన్‌గా వ్యవహరించనున్న ఈ కమిటీకి.. వెటరన్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, కె.ఎల్. నారాయణ, మాజీ అధ్యక్షుడు దిల్ రాజు, కె. అశోక్ కుమార్ కన్వీనర్లుగా బాధ్యతలు తీసుకున్నారు. వీరి పర్యవేక్షణలోనే కొత్త కమిటీ తమ కార్యాచరణను సాగించనుంది.
Also Read
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
ఈ పర్సంటేజీల పంచాయితీలో ఎవరి వాదనలు వారు స్పష్టంగా వినిపించే అవకాశం కల్పించేలా, మూడు రంగాల (నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు) నుంచి సమానంగా ఏడుగురు చొప్పున మొత్తం 21 మంది సభ్యులతో ఈ స్పెషల్ సబ్-కమిటీని నియమించారు.
నిర్మాతల మండలి నుంచి: వై. సురేందర్ రెడ్డి, వై. సుప్రియ, వై. రవిశంకర్, బి. బాపినీడు, చెరుకూరి సుధాకర్, ఎస్.కె.ఎన్ (SKN), టి. ప్రసన్న కుమార్.
ఎగ్జిబిటర్ల రంగం నుంచి: వి. ప్రతాప్ రెడ్డి, టి. బాలగోవింద్ రాజ్, కె. అనుపమ్ రెడ్డి, పి. శ్రీనివాసరావు, జి. వీరనారాయణ బాబు, కె. వంశీ కిషోర్ (చిన్ని), ఎం. విజేందర్ రెడ్డి.
డిస్ట్రిబ్యూటర్ల వర్గం నుంచి: డి. విష్ణుమూర్తి, వి. వీరనాయుడు, ఎన్. సుధాకర్ రెడ్డి, ముత్యాల రామదాసు, ఎన్. నాగార్జున, ఠాగూర్ మధు, ధీరజ్ మొగిలినేని. ఉన్నారు.
ఏర్పాటైన 21 మంది సభ్యుల కమిటీ ఈ పర్సంటేజీల చిక్కుముడిని ఎంత త్వరగా, ఎంత చాకచక్యంగా విప్పుతుందనే దానిపై యావత్ తెలుగు సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తీసుకున్న ఈ నిర్ణయం టాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
Meerpet Aya Murder: రూ.10 వేల కోసం ఘోరం.. మీర్పేట్ ఆయా హత్యలో షాకింగ్ ట్విస్ట్.!
-
CM Chandrababu: అనకాపల్లి అభివృద్ధిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. గూగుల్ డేటా సెంటర్, గోదావరి జలాలపై స్పష్టత..
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!