Eesha Rebba Special song in Gangs of Godavari Movie: తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఆమెకి ఎందుకో అనుకున్న స్థాయిలో గుర్తింపు దక్క లేదు. నిజానికి ఆమె నటించిన సినిమాలు కొన్ని హిట్లు అయ్యాయి కానీ అవి ఏమీ ఆమె ఖాతాలో పడలేదు. అయితే ఈ భామ ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది అదేమిటంటే ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సినిమా మరేమిటో కాదు విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా.
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. అనుకున్నదే అయింది?
రౌడీ ఫెలో చల్ మోహన్ రంగా లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సితార బ్యానర్ మీద నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఈషా ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసినట్టుగా తెలుస్తోంది.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో స్టార్ హీరోయిన్ల సైతం చేస్తున్న స్పెషల్ సాంగ్ తాను చేస్తే తప్పేంటి అని భావించి ఈ మేరకు ఈషా రెబ్బా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది మార్చి 8వ తేదీన రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే సినిమా వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుందని భావునిచి ఈ సాంగ్ చేస్తున్నారట. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది.