Site icon NTV Telugu

Rana : ఈడీ విచారణకు రానా డుమ్మా.. టైమ్ కోరిన హీరో..

Rana

Rana

Rana : హీరో దగ్గుబాటి రానా బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. ఆ రోజే విచారణకు రావాలంటూ రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్లకు నోటీసులు ఇచ్చింది. రేపు అంటే జులై 23న ఉదయం రానా విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ ఆదేశించింది. అయితే తాజాగా రానా దీనిపై స్పందించారు. తనకు ముందే ఫిక్స్ అయిన వరుస షూటింగులు ఉన్నందున రేపు విచారణకు రాలేనంటూ ఈడీకి తెలిపాడు. తనకు కొంత సమయం ఇవ్వాలని కోరాడు. దీనిపై ఈడీ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రానా రెండు సినిమాలతో బిజీగా ఉంటున్నాడు.

Read Also : Kingdom : కింగ్ డమ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

అటు విజయ్ దేవరకొండ కూడా త్వరలోనే విచారణకు రావాల్సి ఉంది. మంచు లక్ష్మీ కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రానా న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత విచారణకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ అన్వేష్ వరుస వీడియోలతో విరుచుకుపడటంతో వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పుడు రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటి వారు విచారణకు వెళ్లారు. కానీ అంతకు మించి దీనిపై ఎలాంటి అప్డేట్ కనిపించలేదు. ఇక పెద్ద స్టార్లు అయితే తమకు తెలియకుండా చేశామని.. పర్మిషన్ ఉన్నవే చేశాం అంటూ చెప్పారు. కానీ తాజాగా ఈడీ రంగంలోకి దిగడంతో విచారణ లోతుగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Exit mobile version