I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఈడీ అధికారులు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు లేఖ రాశారు. ఐ బొమ్మ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడి అనుమానాలు వ్యక్తం చేసింది. రవి కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని లేఖలో కోరింది. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతా నుండి 3.5 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుండి పెద్ద మొత్తంలో రవి ఖాతాకు డబ్బులు వచ్చాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే రవి బెట్టింగ్ యాప్స్ ను తన సైట్ లో ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. ఇలా ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడు.
Read Also : I Bomma Ravi : డబ్బు సంపాదించట్లేదని భార్య, అత్త హేళన.. పైరసీ వైపు రవి
నెలకు 15 లక్షలు క్రిప్టో వాలెట్ నుండి రవి NRE ఖాతాకు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. వీటిపై ఈడీ దర్యాప్తు చేయబోతోంది. బెట్టింగ్ యాప్స్ కేసుపై ఈడీ ఇప్పటికే సినీ హీరోలను విచారిస్తోంది. వాళ్ల ఖాతాలకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేశారు అనే కోణంలో విచారణ సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రవి ఖాతాకు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల ఖాతాల నుంచి డబ్బులు వచ్చాయి. ఆ ఖాతాల ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : I Bomma Ravi : సజ్జనార్ కు రవి తండ్రి రిక్వెస్ట్… మనవరాలి కోసం..
