Bigg Boss 9 :బిగ్ బాస్ 9 ఫుల్ రచ్చ రచ్చగా నడుస్తోంది. మరి ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత హౌస్ లో చాలా రకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత దమ్ము శ్రీజ సడన్ గా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత వారం దమ్ము శ్రీజతో పాటు భరణి ని హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించారు. నామినేషన్స్ లో దువ్వాడ మాధురికి శ్రీజ కౌంటర్ ఇచ్చింది. మాధురి హౌస్ లోకి వచ్చినప్పుడు ఆమె పేరు తెలియదని తాను అంటే బయటకెళ్ళి తెలుసుకోవాలని మాధురి చెప్పింది. బయటకు వెళ్లి అడిగితే ఎవరూ ఆమె పేరు తెలియదు అంటున్నారు అని పంచ్ వేసింది శ్రీజ.
Read Also : Baahubali The Epic : అది బాహుబలి 3 కాదు.. రాజమౌళి షాకింగ్ స్టేట్ మెంట్
ఇదే విషయంపై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. దమ్ము శ్రీజ ఎవరో నాకు బాగా తెలుసు. ఆమె వైజాగ్ అమ్మాయి. వాళ్ల కుటుంబం వాళ్ల నాన్న అందరూ తెలుసు. మాధురి హౌస్ లోకి వచ్చినప్పుడు అందరూ వెళ్లి పలకరించారు. అలాంటప్పుడు ఆమె పేరు దమ్ము శ్రీజకు తెలియదా. ఒకవేళ తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని అడగాలి. కానీ శ్రీజ అహంకారంతో అడిగింది. అందుకే మాధురి అలా కౌంటర్ ఇచ్చింది. దమ్ము శ్రీజ కావాలంటే నిజాయితీగా ఆడాలి. అంతేగాని ఇలా అహంకారం చూపించకూడదు అంటూ దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.
Read Also : Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ