Dulkar Salman : మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. భూటాన్ నుంచి అక్రమంగా కార్లను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. రీసెంట్ గా ఐటీ అధికారులు కేరళలోని సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ సహా చాలా మందికి చెందిన 20 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. దీంతో దుల్కర్ సల్మాన్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ ను విచారించిన కోర్టు.. కారు రిలీజ్ పై వారంలోగా ఏదో ఒకటి తేల్చాలని ఐటీ అధికారులను ఆదేశించింది. దీంతో ఆ పేపర్లను ఐటీ అధికారులకు దుల్కర్ సమర్పించారు. ఈ నేపథ్యంలోనే దుల్కర్ సల్మాన్ తో పాటు మరో వ్యక్తికి చెందిన కారును రిలీజ్ చేసేందుకు ఐటీ అధికారులు సమ్మతించారు.
Read Also : Kantara Chapter 1 : కాంతార-1 బీభత్సం.. ఇప్పటి దాకా ఎంత వసూలు చేసిందంటే..?
కాకపోతే ఆ కారు విలువలో 20 శాతం బ్యాంక్ గ్యారెంటీని పెట్టిన తర్వాత రిలీజ్ చేయనున్నారు. మలయాళంకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఇప్పుడు కోర్టులో తమ కార్ల కోసం పిటిషన్లు వేశారు. తక్కువ ధరకు వస్తుందనే నెపంతోనే భూటాన్ నుంచి లగ్జరీ కార్లను తెచ్చుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దుల్కర్ విషయానికి వస్తే లక్కీ భాస్కర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్లతోనే వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు దుల్కర్.
Dulkar Salman : Devi Sri Prasad: అంతమంది హీరోలు కాదన్న సినిమా ఎందుకు?
