ఈ సంక్రాంతికి తెలుగు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ రిలీజ్ అవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. దీంతో రవితేజ ‘ఈగల్’తో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కూడా వెనకడుగు వేశాయి. ఈగల్ సినిమా ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అవగా… తమిళ్ సినిమాలు అయలాన్, కెప్టెన్ మిల్లర్ మాత్రం తెలుగులో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో సంక్రాంతికే రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కెప్టెన్ మిల్లర్ సినిమా 75 కోట్లని రాబట్టగా… అయలాన్ సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఈ రెండు సినిమాలు కోలీవుడ్ కి 2024ని గ్రాండ్ గా స్టార్ట్ చేసాయి. ఇప్పటికీ కోలీవుడ్ థియేటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ మైంటైన్ చేస్తున్న ఈ రెండు సినిమాలు భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్నాయి. ఇదే జోష్‌లో తెలుగులో రిలీజ్ కాబోతున్నాయి.
ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ రెండు సినిమాలు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంది పైగా కెప్టెన్ మిల్లర్, అయలాన్ అక్కడ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి కాబట్టి… తెలుగులోను మంచి బజ్ జనరేట్ అవుతోంది. జనవరి 25న కెప్టెన్ మిల్లర్ రిలీజ్ అవుతుండగా… 26న అయలాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే వారం వరకు తెలుగులో సంక్రాంతి సినిమాలదే హవా ఉండనుంది. అయితే… ఈ రెండు డబ్బింగ్ సినిమాలు ఇక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంటే… సంక్రాంతి సినిమాల జోరు తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి ధనుష్, శివ కార్తికేయన్ తెలుగులోను హిట్ అందుకుంటారేమో చూడాలి.