అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘పుష్ప’ విజయంతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన F3, పుష్ప: ది రైజ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఖిలాడి వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ‘ఖిలాడీ’ ఆల్బమ్ గురించి దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ, రాక్‌స్టార్ DSP మొత్తం ఆరు పాటల ట్యూన్‌లను రికార్డ్ టైమ్‌లో కంపోజ్ చేశారని అన్నారు. “నేను స్క్రిప్ట్‌ని డీఎస్పీకి చెప్పగానే మొత్తం ఆరు పాటల ట్యూన్స్‌ని, అది కూడా కేవలం 30 నిమిషాల్లోనే నాకు అందించారు’’ అని వర్మ చెప్పారు. ‘ఖిలాడీ’ నుంచి ఇటీవల విడుదలైన ‘క్యాచ్ మి ఇఫ్ యు కెన్’ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారింది మరియు ఇది కేవలం 3 రోజుల్లో 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించింది.
Read Also : Khiladi : హీరోయిన్ కు సారీ చెప్పిన డైరెక్టర్… ఏం జరిగిందంటే ?
మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్న ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ యాక్షన్ ప్యాక్ రైడ్‌లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఇక నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న DSP సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం.