Driver Jamuna First look : క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ అర్థవంతమైన చిత్రాలలో నటిస్తోంది ఐశ్వర్యా రాజేశ్. ఆమె నటించిన కథాబలం ఉన్న తమిళ చిత్రాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. అలానే తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు తమిళంలో డబ్ అవుతున్నాయి. తాజాగా ఐశ్వర్యా రాజేశ్ కిన్ స్లిన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో క్యాబ్ డ్రైవర్ పాత్రను చేస్తోంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేశారు. తమిళంతో పాటు ఈ సినిమాను తెలుగు, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలన్నది చిత్ర నిర్మాణ సంస్థ 18 రీల్స్ ఆలోచన. అన్ని భాషల్లోనూ దీనికి ‘డ్రైవర్ జమున’ అనే పేరునే ఖరారు చేశారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ‘డ్రైవర్ జమున’ గురించి దర్శకుడు కిన్ స్లిన్ మాట్లాడుతూ, ”ఐశ్వర్యా రాజేశ్ సినిమా అంటేనే సమ్ థింగ్ స్పెషల్ అనే భావన ప్రేక్షకులలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ కథను తయారు చేయడం జరిగింది. ఇవాళ టాక్సీ ఇండస్ట్రీ విశేషంగా పెరిగిపోయింది. క్యాబ్ డ్రైవర్లకు సంబంధించిన అంశాలను ఇందులో డీల్ చేస్తున్నాం. అందులోనూ ప్రత్యేకంగా ఓ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన లేడీ డ్రైవర్ జీవితాన్ని చూపించబోతున్నాం. ఈ క్రైమ్ థిల్లర్ కోసం తన శరీరాకృతిని మరింత దృఢం చేసుకోవడానికి ఐశ్వర్యా రాజేశ్ కృషి చేస్తోంది. అలానే క్యాబ్ డ్రైవర్స్ ను కలిసి, వారి బాడీ లాంగ్వేజ్ ను గమనించి, దానికి అనుగుణంగా తనని తాను మలుచుకునే ప్రయత్నం చేస్తోంది” అని చెప్పారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!