Drinker Sai : మళ్ళీ జీ5 ట్రెండింగ్ లోకి ‘డ్రింకర్ సాయి’?

Dharma Mahesh

Dharma Mahesh

థియేటర్లలో యూత్, మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘డ్రింకర్ సాయి’ ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ‘జీ5’ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రమంలో ‘ఫ్రీ ఆన్ జీ5’ విభాగంలో టాప్-1 ట్రెండింగ్ మూవీగా దూసుకుపోతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో లీడ్ హీరోగా నటించిన యంగ్ యాక్టర్ ధర్మ మహేష్ నటనకు సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

పాత్రలో పూర్తిగా లీనమైన ధర్మ మహేష్ పర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒక సాధారణ యువకుడి జీవితంలో జరిగే పరిణామాలు, అతని ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణలను ఆయన ఎంతో నేచురల్‌గా పండించారు. భావోద్వేగాలు, ప్రేమ, ఆవేశం, బాధ, తిరుగుబాటు స్వభావం వంటి విభిన్న కోణాలను ఎంతో సహజంగా తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ చిత్రంలో కనబరిచిన నటనకు గానూ ధర్మ మహేష్ దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక **‘గామా అవార్డ్స్’ వేదికపై ‘బెస్ట్ డెబ్యూ యాక్టర్’ అవార్డును అందుకోవడం విశేషం.

×
×
Ad