Site icon NTV Telugu

NTR30: తారక్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. ఆరోజు మాస్ జాతరే!

Ntr 30 Double Dhamak

Ntr 30 Double Dhamak

Double Treat For NTR Fans On His Birthday: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! మార్చి 24వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం రెండు క్రేజీ అప్డేట్స్ రానున్నాయట. మే 19వ తేదీన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేయనున్నారని, మే 20వ తేదీన ఒక గ్లిప్స్ విడుదల చేయనున్నారని సమాచారం. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే.. తారక్ పుట్టినరోజు నాడు అతని ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకానే అవుతుంది. గ్లిమ్స్ లేకపోయినా.. కనీసం ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఉండొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి

కాగా.. ఈ సినిమా ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రీసెంట్‌గానే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా రూపొందుతుండటంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే.. పాన్ ఇండియా స్కేల్‌లో ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు

Exit mobile version