Karthikeya: ‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల…’, ‘సొల్లుడా శివ…’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ను విడుదల చేశారు.
”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే..
ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే..
Also Read
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhanush - SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్..
అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్..
కొట్టేయి తాళం.. తీసేయి గొళ్ళెం..
దొరికిందంతా దోచేయ్ రా..
పట్టిస్తారు హారతి పళ్లెం..
దర్జాగా ఖాళి చెయ్యండ్రా..
దొంగోడే దొరగాడు.. దొంగోడే దొరగాడు..
దొంగోడే దొరగాడు.. దొంగోడే దొరగాడు”
అంటూ సాగిన ఈ గీతాన్ని సాహితి చాగంటి ఆలపించారు. కిట్టూ విస్సాప్రగడ రాశారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఓ మతం, ఓ ఆచారం, ఓ సంప్రదాయం అని కాదు… ప్రతి ఊరిలో, ప్రతి చోట మతం పేరుతో మనుషుల్ని దోచుకునే మోసగాళ్లు ఉన్నారని చెప్పే గీతమిది. ముఖ్యంగా పల్లెటూళ్లలో ఏం జరుగుతుందో చూపించినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది.
చిత్ర దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”ఒక ఊరి ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని, వాళ్ళకు దేవుని మీద ఉన్న భక్తిని గమనించిన కొందరు మోసగాళ్లు మూఢ నమ్మకాల పేరుతో ప్రజలను ఎలా దోచుకుంటున్నారనేది ఈ పాటలో చూపించాం. కథలో భాగంగా వస్తుంది. ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు వారిలో ఓ ఆలోచన రేకెత్తించే పాట ఇది” అని చెప్పారు.
చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ”మేం విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది. సినిమాపై క్రేజ్ నెలకొంది. విడుదలకు నెల ముందు బిజినెస్ అంతా క్లోజ్ అయ్యింది. మా సినిమాకు అద్భుతమైన బాణీలు అందించిన మణిశర్మ గారికి థాంక్స్. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుంది. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం” అన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!