యాక్టర్ డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మచ్ అవైటెడ్ డాన్ 3 మూవీని అనౌన్స్ చేసాడు. చాలా కాలంగా ఈ మూవీ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్ కి షాక్ ఇస్తూ షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ తో డాన్ 3ని అనౌన్స్ చేసాడు ఫర్హాన్. ఈ సందర్భంగా ఒక వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు, ఈ వీడియోలో రణవీర్ సింగ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. టీజర్ రణవీర్ డైలాగ్‌తో వీడియో స్టార్ట్ అయ్యి, లాస్ట్ లో అతని ఫేస్ రివీల్ అవ్వడంతో వీడియో ఎండ్ అయ్యింది. అనౌన్స్మెంట్ వీడియోకి ట్రేడ్ మార్క్ డాన్ థీమ్ మ్యూజిక్ కూడా అటాచ్ చేసి వింటేజ్ వైబ్స్ ఇచ్చాడు ఫర్హాన్. డాన్ గా రణ్వీర్ సింగ్ బాగానే ఉన్నాడు కానీ షారుఖ్ ఇమేజ్ ని అతను మ్యాచ్ చేయడం అనేది జరగని పని. ఇదే అనౌన్స్మెంట్ వీడియోలో షారుఖ్ ఉండి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియా షేక్ అయ్యేది.
డాన్ ఫ్రాంచైజ్ ని షారుఖ్ లేకుండా ఊహించడం కష్టమే. సినీ అభిమానులు కూడా షారుఖ్ డాన్ గా మళ్లీ కనిపిస్తాడనే ఆశతోనే ఇంతకాలం వెయిట్ చేసారు. ఈరోజు సడన్ గా కొత్త శకం మొదలయ్యింది అంటూ షారుఖ్ ప్లేస్ లో రణ్వీర్ సింగ్ ని చూడమంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయడం కష్టమే. షారుఖ్ ఫ్యాన్స్ కే కాదు ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కి కూడా అది ఇబ్బంది కలిగించే విషయమే. సోషల్ మీడియాలో ఇప్పటికే నెగిటివిటీ విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. మరి అంత నెగిటివిటీని దాటి ఫర్హాన్, రణ్వీర్ తో డాన్ 3 సినిమా చేస్తాడా లేక ప్రాజెక్ట్ ని షెల్ప్ చేస్తాడా అనేది చూడాలి. రణ్వీర్ సింగ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోని డాన్ గా చూడడానికి వెయిట్ చేస్తున్నారు.
A New Era Begins #Don3 @RanveerOfficial #JasonWest @javedakhtarjadu @ritesh_sid @ShankarEhsanLoy @PushkarGayatri @j10kassim @roo_cha @vishalrr @excelmovies @rupinsuchak @chouhanmanoj82 pic.twitter.com/i1hHrl6fuo
— Farhan Akhtar (@FarOutAkhtar) August 9, 2023