Sohi Sisters: చిత్ర పరిశ్రమ లో విషాదం.. అక్క మృతిచెందిన కొద్దిసేపటికే చెల్లి కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sohi Sisters: చిత్ర పరిశ్రమలో విషాదం విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటీమణులు డాలీ సోహి, అమన్ దీప్ సోహి.. కొద్దీ గంటల వ్యవధిలోనే మృతిచెందారు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి మృతి చెందడంతో సోహి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. డాలీ సోహి.. జనక్, భాభీ వంటి టీవీ షోలతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది. ఇక ఆరునెలల క్రితమే ఆమె క్యాన్సర్ బారిన పడింది. గర్భాశయ క్యాన్సర్ అని తెలియడంతో ఆమె చికిత్స తీసుకుంటుంది. క్యాన్సర్ ఊపిరితిత్తుల వరకు పాకిందని.. ఆరోగ్యం క్షీణించడంతో గతరాత్రే డాలీని ఆసుపత్రిలో చేర్చామని ఆమె సోదరుడు మన్‌ప్రీత్ తెలిపారు.
ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె క్యాన్సర్ నుంచి కోలుకుంటుందని అందరూ ఆశించారు. ఆమె పరిస్థితి ఇలా ఉంటే .. ఆమె సోదరి, నటి అమన్ దీప్ సోహి కామెర్ల బారిన పడింది. గత కొన్నిరోజులుగా ఆమె కూడా డీవీ పాటిల్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. అయితే కామెర్లు ముదరడంతో అమన్ దీప్ సోహి నేటి ఉదయం మృతి చెందింది. సోదరి మరణవార్త విన్న కొద్దిసేపటికే డాలీ కూడా కన్నుమూసిందని వారి సోదరుడు మన్‌ప్రీత్ సోహి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఇద్దరు కూతుళ్లను ఒకేరోజు పోగొట్టుకున్న వారి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివలన కావడం లేదు. ఇక ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు ప్రముఖులు సోహి సిస్టర్స్ కు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..