స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. లత మృతితో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. స్వర కోకిలగా పేరుగాంచిన భారతరత్న గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తన కెరీర్‌లో వేలాది పాటలకు గాత్రాన్ని అందించారు. లతా అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు. ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే లత చివరి పాట ఏదో తెలుసా?
Read Also : లతాజీకి బాలీవుడ్ ప్రముఖుల నివాళి
లతా మంగేష్కర్ చాలా హిందీ పాటలకు ఆమె మధురమైన గాత్రాన్ని అందించారు. లతా మంగేష్కర్ దాదాపు 36 భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలకు తన గాత్రాన్ని అందించారు. చివరగా విడుదలైన లతా మంగేష్కర్ పాట విషయానికొస్తే అది మయూరేష్ పాయ్ స్వరపరచిన ‘సౌగంధ్ ముఝే ఈజ్ మిట్టి కి’. ఈ పాట 30 మార్చి 2019న విడుదలైంది. ఆమె చివరి సినిమా పాట 2006 సంవత్సరంలో విడుదలైన ‘రంగ్ దే బసంతి’లోని ‘లుకా చుప్పి’ పాట. ఈ పాటను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. లతా మంగేష్కర్ చివరి హిందీ ఆల్బమ్ 2004లో విడుదలైన ‘వీర్-జారా’ చిత్రం. లతా మంగేష్కర్ పాడిన చాలా పాటలు ఇంకా విడుదల కాలేదు. సంగీత స్వరకర్త, దర్శకుడు, నిర్మాత విశాల్ భరద్వాజ్ సెప్టెంబర్ 2021లో లతా మంగేష్కర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాంగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే లతా చివరి సాంగ్.