Anand Ranga is married to Telugu film dubbing artist Sowmya Sharma: అనుష్క శెట్టి & కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వంటి వారు మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత విజయవంతమైన స్టార్ హీరోయిన్లుగా ఉండేవారు. మనం ఆన్‌స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రెజెన్స్ కి ఫిదా అవుతాం కానీ వీరి కెరీర్ లో మెజారిటీ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గురించి మీలో ఎక్కువ మందికి తెలియక పోవచ్చు. ముఖ్యంగా అనుష్క & కాజల్ కి అంతగా తెలుగు రాదు, కాబట్టి వారికి డబ్ చెయ్యడానికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు…వీరి కెరీర్ లో డిఫరెంట్ డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పారు కానీ సౌమ్య శర్మ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పిన డబ్బింగ్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేదు అనే చెప్పాలి. అస్సలు ఎవరు ఈ సౌమ్య శర్మ? ఏయే సినిమాలకు డబ్బింగ్ చెప్పింది? అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూపర్ మూవీ లో అయేషా టకియాకి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆర్జే సౌమ్య శర్మ ఆ తర్వాత చత్రపతిలో శ్రియ, లక్ష్మి లో నయన్ కి డబ్బింగ్ చెప్పారు.
Ashish Reddy: ఘనంగా యంగ్ హీరో పెళ్లి.. హైలైట్ గా దిల్ రాజు డ్యాన్స్
విక్రమార్కుడు మూవీకి అనుష్కకు సౌమ్య శర్మ తొలిసారి డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమా లో అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ కి సౌమ్య శర్మ డబ్బింగ్ చాలా ఆప్ట్ గా సింక్ అయ్యింది. ఇంకా ఏం ఉంది కట్ చేస్తే అనుష్క తర్వాత చేసిన లక్ష్యం సినిమాకి కూడా సౌమ్య శర్మ నే డబ్బింగ్ చెప్పింది.ఈ సినిమాకి సౌమ్య శర్మ కి బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా వచ్చింది. RJ గా కెరీర్ స్టార్ట్ చేసి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా తనకి అంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య శర్మ…స్క్రిప్ట్ రైటర్ కూడా. సరే జాను, అమెరికా అమ్మాయి లాంటి పాపులర్ టీవీ సీరియల్స్ కి స్క్రిప్ట్ రైటర్ గా పని చేశారు. ఇక సిద్ధార్థ నటించిన ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగను ఆమె వివాహం చేసుకుంది. 2010లో వీరి వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కూడా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యవహరించారు.