పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్స్ సినిమా పై భారీ హైప్ ను పెంచాయి.కానీ విడుదల తరువాత సినిమా పై భారీగా నెగటివ్ టాక్ వచ్చింది.పలువురు సినీ ప్రముఖుల నుండి విమర్శలు కూడా వచ్చాయి.ప్రభాస్ అభిమానులు కూడా దర్శకుడు ఓం రౌత్ ను బాగా విమర్శించారు. ఈ సినిమాను . దాదాపు 500 కోట్లతో తెరకెక్కించినట్లు సమాచారం.కానీ ఈ సినిమా అందరిని నిరాశ పరిచింది.ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడి గా నటించిగా బాలీవుడ్ భామ అయిన కృతిసనన్ జానకిగా నటించి మెప్పించింది. ఇతిహాస కథ రామాయణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. విడుదలకు ముందు వదిలిన టీజర్ లోనే పూర్ గ్రాఫిక్స్ ను వాడారు ఆ టీజర్ ఎవరికీ నచ్చకపోవడంతో మళ్ళీ గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచి విడుదల చేసారు అది కొంతవరకు అయితే బాగానే ఉంది. ఆ తరువాత విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే మెప్పించింది..కానీ సినిమా విడుదల అయ్యాక తీవ్రంగా విమర్శలు వచ్చాయి.ముఖ్యంగా రామాయణ కథను మార్చి చూపించారని విమర్శలు వచ్చాయి..
రావణాసురుడి పాత్రను కూడా తప్పుగా చూపించారనీ మండి పడుతున్నారు. విడుదలకు ముందు ఇచ్చిన భారీ హైప్ కారణంగా మంచి ఓపినింగ్స్ తో పాటు కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ సినిమా.నెగిటివ్ టాక్ కారణంగా ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఓటీటీ విడుదల గురించి ఒక వార్త బాగా వైరల్ గా మారింది.ఆదిపురుష్ ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిపురుష్ ఓటీటీ విడుదల పై నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.. ఈ మూవీని ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం రోజున ఓటీటీలో విడుదల చేయనున్నారని సమాచారం.త్వరలోనే ఈ విషయం పై పూర్తి అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.