Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dj Tillu Team Visits Temples

Neha Shetty: దుఃఖాన్ని దిగమింగుకున్న ముద్దుగుమ్మ!

Published Date :February 15, 2022 , 3:37 pm
By Roja Pantham
Neha Shetty: దుఃఖాన్ని దిగమింగుకున్న ముద్దుగుమ్మ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

చిత్రసీమ బహు విచిత్రమైంది! ఎప్పుడు ప్రేక్షకులు ఎవరిని అందలం ఎక్కిస్తారో తెలియదు. ఒక్కసారి మనసారా స్వాగతించారంటే… మరో ఆలోచన లేకుండా దానిని అంగీకరించాలి. ఆ ప్రోత్సాహాన్ని పునాదిగా చేసుకుని పైకి ఎదగాలి. ఇప్పుడు అదే పనిచేస్తోంది అందాల భామ నేహా శెట్టి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలతో ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక అవకాశాలు రావేమో అనుకుంటున్న సమయంలో ‘డీజే టిల్లు’ రూపంలో ఆమెకు మరో ఛాన్స్ దక్కింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో తనదైన శైలిలో నటించి, మెప్పించింది నేహా శెట్టి. మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆమె శరీరం మీద పుట్టుమచ్చలపై కాస్తంత కాంట్రవర్శీ చెలరేగినా… అదీ సినిమా ప్రమోషన్ కు బాగానే ఉపయోగపడింది. మొత్తం మీద ఈ నెల 12న విడుదలైన ‘డీజే టిల్లు’ కుర్రకారును కిర్రెక్కిస్తోంది.

బాధాకరం ఏమంటే కరెక్ట్ గా ‘డీజే టిల్లు’ సినిమా విడుదలకు ఒకటి రెండు రోజుల ముందు… నేహాశెట్టి బామ్మ చనిపోయింది. చిన్నప్పటి నుండీ తనను పెంచి పెద్ద చేసి, తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన ఆవిడ మరణం నేహాశెట్టిని సహజంగానే కృంగ తీసింది. మూవీ రిలీజ్ కు రెండు రోజుల ముందే అన్ని ప్రమోషనల్ ఇంటర్యూస్ కాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయింది నేహా శెట్టి. అయితే ఒక్కసారి మూవీకి సక్సెస్ టాక్ రావడంతో దానిని అందిపుచ్చుకుని కెరీర్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది కాబట్టి నిర్మాత సూర్యదేవర నాగవంశీ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుసుకున్న నేహా దుఃఖాన్ని దిగమింగుకుని సక్సెస్ టూర్ కు వచ్చేసింది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు, పట్టణాలలో ‘డీజే టిల్లు’ ప్రదర్శిస్తున్న థియేటర్స్ కు వెళ్ళి హీరో సిద్ధూ, హీరోయిన్ నేహా, దర్శకుడు విమల్ కృష్ణ ఆడియెన్స్ కు స్వయంగా ధ్యాంక్స్ చెబుతున్నారు. పనిలో పనిగా దేవాలయాలనూ సందర్శిస్తున్నారు.

Also Read

  • Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
  • NTRNEEL : డ్రాగన్ పార్ట్ - 2 కోసం ఎన్టీఆర్ షాకింగ్ మేకోవర్
  • Raaka : అప్పుడే.. ర్యాంపేజ్ షురూ చేసిన అల్లు అర్జున్ 'రాకా'
  • NBK 112 : బాలయ్య-కొరటాల శివ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. మాస్ విధ్వంసమే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DJ Tillu
  • Neha Shetty
  • siddu jonnalagadda
  • tollywood movie
  • Tollywood News

తాజావార్తలు

  • Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్

  • CM Chandrababu: స్టేజ్‌పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్‌ వార్నింగ్..

  • IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!

  • Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!

  • Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్‌రూట్ పులావ్ తయారు చేయండిలా..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions