బాలీవుడ్ భామ దిశా పటానీ అందం గురించి, ఆమె వ్యాయామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇంతకుముందు సీకే బ్రాండ్ లోదుస్తుల ప్రచారంతో మంటలు పెట్టేసిన దిశా ఇప్పుడు బీచ్ లలోను, జిమ్ లోనూ వ్యాయామాలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ఇటీవలే అమ్మడు జిమ్ చేస్తున్న వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసినవారందరు అమ్మడు మోటివేట్ చేస్తుందా..? లేక మంటలు పుట్టిస్తుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఆ వీడియోలో ఏముంది అంటే.. దిశా వీపు మొత్తం కనిపించేలా ఉన్న డ్రెస్ వేసుకొని విస్తృత గ్రిప్ పుల్ చేస్తూ కనిపించింది.
ఇంకేముంది సన్నని సన్నజాజి తీగలా ఉన్న ఆమె నడుము.. ఆమె వీపందం కుర్రాళ్లను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఆ జిమ్ ఎక్కడో చెప్తే మేము కూడా జాయిన్ అవుతాం అని కొందరు.. ఆ వీపందం ఏంటీ .. దిశా అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం దిశా కరణ్ జోహార్ నిర్మాణంలో యాక్షన్ డ్రామా యోధా షూటింగ్ పూర్తిచేయగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్ ని అమ్మడు ఓకే చేసింది.
