Disastrous Weekend 2022 మార్చ్ 11… సినీ ప్రియులకు బాగా గుర్తుండిపోయే రోజు కావచ్చు. ఎందుకంటే ఆ రోజు విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. అటు బిగ్ స్క్రీన్ పై విడుదలైన “రాధేశ్యామ్”కు మిశ్రమ స్పందన వస్తే, ఓటిటిలో వచ్చిన నాలుగైదు సినిమాలు పూర్తిగా నిరాశ పరిచాయి. మొత్తానికి సినిమా చరిత్రలో మరో డిజాస్టర్ వీకెండ్ గా మార్చ్ 11, శుక్రవారం నిలిచింది. సాధారణంగా ఇండస్ట్రీ మొత్తం సెంటిమెంట్ గా భావించే శుక్రవారం వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ సందడి హంగామా ఉంటుంది. ప్రేక్షకుల్లోనూ కొత్త సినిమా చూడొచ్చనే ఉత్సాహం నెలకొంటుంది. అయితే ఈ వీకెండ్ మాత్రం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలమైంది. ఇక “రాధేశ్యామ్” వంటి పెద్ద సినిమాతో తలపడకుండా ఓటిటిలో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు ఏంటంటే… ?
Read Also : Paruchuri: స్టార్ రైటర్ ఫోటో చూసి షాకైన ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ ధనుష్ కొత్త చిత్రం “మారన్” డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యింది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. సాధారణంగా ధనుష్ అంటే మంచి మూవీ అనే అభిప్రాయంతో సినిమా చూసిన వారికి ఈ సినిమా పేలవమైన స్క్రిప్ట్ దాదాపు చిరాకెత్తించిందనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ధనుష్ కు ఉన్న క్రేజ్ ఏమాత్రం సహాయం చేయలేకపోయింది. స్క్రిప్ట్ వినకుండా కేవలం కార్తీక్ నరేన్ పై నమ్మకంతోనే ధనుష్ ఈ సినిమా చేశాడేమో అంటూ ట్రోలింగ్ చేశారు నెటిజన్లు. ఇక SonyLIV లో డైరెక్ట్ గా విడుదలైన ఆది పినిశెట్టి “క్లాప్”కు విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ దక్కలేదు. రవితేజ కొత్త సినిమా ‘ఖిలాడీ’, ‘రౌడీ బాయ్స్’కు కూడా ఓటిటిలో ఏమాత్రం సందడి చేయలేకపోయాయి. ఇంట్లోనే కూర్చుని హాయిగా ఓటిటిలో సినిమాను వీక్షించొచ్చు అని భావించే ప్రేక్షకులకు Disastrous Weekend దారుణమైన అనుభవాన్ని ఇచ్చిందనే చెప్పాలి. మొత్తానికి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచారు ఈ హీరోలు !