Dirty Fellow movie Getting ready for release: శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా, మూర్తి సాయి అడారి డైరెక్షన్ లో, జీ శాంతి బాబు నిర్మిస్తున్న మూవీ డర్టీ ఫెలో. రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సందర్భంగా హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తొలి కాపీతో రిలీజ్ కు రెడీ అయ్యిందని అన్నారు. నెక్స్ట్ వీక్ లో టీజర్ ను ఓ ప్రముఖ హీరో రిలీజ్ చేయనున్నారని పేర్కొన్న ఆయన అక్టోబర్ లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు మూర్తి సాయి ఏదైతే కధ మాకు చెప్పారో అది స్క్రీన్ మీద చూసినప్పుడు సినిమా మీద మరింత నమ్మకం కుదిరిందని, మా అంచనాలకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని అన్నారు.
Vadivelu: స్టార్ కమెడియన్ ఇంట తీవ్ర విషాదం
ఒక తండ్రి తన కొడుకును సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి? అనేదే ఈ సినిమా అని అన్నారు. హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారని ఆయన అన్నారు. దర్శకుడు మోహన్ సాయి అడారి మాట్లాడుతూ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో వున్నాయని, హీరో శాంతి చంద్ర, డాక్టర్ సతీష్ సహకారం మరువలేనని అన్నారు. ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయని, తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. డాక్టర్ సతీష్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఎస్ రామకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా హీరో జీ శాంతిచంద్ర ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.