ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్ లోకి వస్తున్నాడు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు మాములుగా అయితే అసలు ఒక సీజన్ లోనే రిలీజ్ కాకూడదు అలాంటిది ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా రిలీజ్ చేస్తున్నారు. దీని కారణంగా అటు డంకీ సినిమాకి ఇటు సలార్ సినిమాకి కలెక్షన్స్ విషయంలో నష్టాలు తప్పవు. ఏ మూవీకి హిట్ టాక్ వస్తే ఆ సినిమాకే ఆడియన్స్ జై కొడతారు. ఇప్పటికైతే సలార్ ట్రైలర్, డంకీ ట్రైలర్ లు బయటకి వచ్చి ఒకటి ఫ్యామిలీ సినిమా ఇంకొకటి యూత్ సినిమా అని పేరు తెచ్చుకున్నాయి. అయితే సలార్ సినిమా ప్రభాస్ మూవీగా కన్నా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవ్వడమే ప్రాజెక్ట్ కి ఇంకా హైప్ పెంచుతుంది.
KGF సినిమాతో ప్రశాంత్ నీల్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్ తో ప్రభాస్ ఎలా కనిపిస్తాడని చూడడానికి థియేటర్స్ వచ్చే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. అలానే షారుఖ్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చినా కూడా డంకీ మాత్రం రాజ్ కుమార్ హిరాణీ సినిమాగానే ప్రమోట్ అవుతుంది. రాజ్ కుమార్ కి అమ్మ ఇమేజ్ డంకీ సినిమాపై పాజిటివ్ ఫీలింగ్ కలిగిస్తుంది. హిరాణీ కాకపోయి ఉంటే డిసెంబర్ 22న సలార్ సినిమాదే విజయం అని ఈపాటికి అందరూ డిసైడ్ అయిపోయే వాళ్లు. సో ఎంత హీరోల ఇమేజ్ తో సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా ఈసారి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది మాత్రం దర్శకుల తాలూకు ఇంపాక్ట్ మాత్రమే. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడు… హిరాణీ సినిమాలో షారుఖ్ ఎలా నటించాడు… ఈ రెండు ప్రశ్నలకి సమాధానం మరో రెండు వారాల్లో తెలియనుంది.