Vassishta: ‘రూటు’ మార్చిన బాలయ్య.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడుగా చేసింది రెండు సినిమాలు, అందులో ఒకటి రిలీజ్ అయి హిట్ అవ్వగా రెండోది ఎప్పుడు వస్తుందో తెలియదు, అయినా వశిష్ట ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయారు. ‘బింబిసార’తో తన టేకింగ్ ఏంటో నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, వశిష్ట కెరీర్‌లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కొడుకుల కోసం కథలు రాసుకుంటే, అవే కథలు తండ్రుల సినిమాల వైపు నడిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది డైరెక్టర్లు మోక్షజ్ఞ కోసం కధలు రాసుకొన్నారు. అలానే మోక్షజ్ఞ డెబ్యూ కోసం వశిష్ట ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. బాలకృష్ణకు కూడా ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు కానీ, లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. మోక్షజ్ఞ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టి, అదే వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఓ సినిమా చేయబోతున్నారట.
Also Read :Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
Also Read
బాలయ్యకు వశిష్ట చెప్పిన మరో లైన్ విపరీతంగా నచ్చడంతో, ఈ ‘నటసింహం’ ప్రాజెక్ట్ ముందుగా టేకాఫ్ కాబోతోందని సమాచారం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ప్రయాణం కూడా ఇలాగే మొదలైంది. మొదట వశిష్ట ఓ కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నారు. చరణ్‌కు కూడా కథ బాగా నచ్చింది. కానీ ఆ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవికి ఒక లైన్ చెప్పడం, అది కాస్తా ‘విశ్వంభర’గా మారి పట్టాలెక్కడం జరిగిపోయాయి. అలా చరణ్ చేయాల్సిన ప్రయాణంలోకి చిరు వచ్చారు. వశిష్ట శైలి, ఆయన విజువలైజేషన్ సీనియర్ స్టార్ హీరోలకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అలా రామ్ చరణ్ కోసం అనుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది, మోక్షజ్ఞ కోసం అనుకుంటే.. ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. మొత్తానికి వశిష్ట రాసుకున్న కథలు వారసుల కంటే ముందుగా వాళ్ల తండ్రులను మెప్పిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ ‘సెంటిమెంట్’గా మారిపోయింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!