మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయసులో కూడా అదే ఎనర్జీ తో సినిమాల లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇకపోతే ఈ ఏడాది ప్రారంభం లో వాల్తేరు వీరయ్య సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కు మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించి న షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. గత ఏడాది బింబిసార సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్అందుకున్న డైరెక్టర్ వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవికి ఒక కథను వినిపించగా అందుకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.అయితే ఈ సినిమా కంటే ముందు వశిష్ఠ బింబిసార 2 సినిమా తీస్తున్నట్లు వార్తలు వచ్చిన ఆ న్యూస్ నిజం కాదని తేలిపోయింది.. తర్వాత చిరంజీవితో వశిష్ఠ మూవీ చేయడం లేదు అంటూ ప్రచారం కూడా జరిగింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. వశిష్ఠ, మెగాస్టార్ కాంబో లో రాబోతున్న సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో అనగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల మాదిరిగా ఉండబోతోంది అని సమాచారం. ఆ సినిమాలో శ్రీదేవి దేవకన్యలా భూమి మీదకు వచ్చి మానవుడైనా చిరంజీవిని ప్రేమించగా.ఇక్కడ మూడు లోకాల నుండి భామలు చిరూ కోసం దిగుతారని సమాచారం.. ఈ సినిమా లో చాలామంది హీరోయిన్స్ కనిపిస్తారని తెలుస్తోంది. మరి ఆ హీరోయిన్లు ఎవరు అన్నది అయితే తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా కూడా వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే అని సమాచారం.ఈ టైటిల్ కి చిరు ఓకె చెబుతాడో లేదో చూడాలి