Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదంలో నుంచి తెలుగు చిత్రసీమ బయటపడక ముందే మరో సీనియర్ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : The Warrior : “బుల్లెట్” సాంగ్ పై రాక్ స్టార్ ఫస్ట్ రివ్యూ
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
1938 నవంబర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం జన్మించారు తాతినేని. 1950లలో తన కజిన్ అయిన టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన తాతినేని… 1966లో వచ్చిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ “నవరాత్రి” చిత్రంతో దర్శకునిగా కెరీర్ ను ప్రారంభించారు. ఇక ఆయన 1966 నుంచి 2000 మధ్య ఎక్కువగా సినిమాలు చేయగా, హిందీ, తెలుగు భాషల్లో కలిపి 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. హిందీలో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన తెలుగు దర్శకుడిగా రామారావు హిస్టరీ క్రియేట్ చేశారు. ఏయన్నార్ తో “నవరాత్రి, బ్రహ్మచారి, సుపుత్రుడు, రైతుకుటుంబం, దొరబాబు, ఆలుమగలు, శ్రీరామరక్ష వంటి చిత్రాలు తీసిన తాతినేని రామారావు… యన్టీఆర్ తో యమగోల, ఆటగాడు, అనురాగదేవత తదితర చిత్రాలు తీశారు.
శోభన్ బాబుతో జీవనతరంగాలు, ఇల్లాలు, బాలకృష్ణతో ప్రెసిడెంట్ గారి అబ్బాయి, తల్లిదండ్రులు మొదలైన సినిమాలు చేశారు. ఇక ‘యమగోల’ రీమేక్ `లోక్-పరలోక్`తో హిందీలోకి దర్శకుడిగా అడుగు పెట్టారు. ఆ తరువాత హిందీలో అనేక చిత్రాలు రూపొందించిన తాతినేని రామారావు ‘అంధా కానూన్’తో రజినీకాంత్ ను బాలీవుడ్ కు పరిచయం చేశారు. కమల్ హాసన్ తో ‘యే తో కమాల్ హోగయా’, జితేంద్ర, మిథున్ చక్రవర్తితో పలు హిందీ సినిమాలు తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్ తో `అంధా కానూన్, ఇంక్విలాబ్` చిత్రాలను తీశారు. ఇక తెలుగులో తాతినేని రామారావు చివరి చిత్రం `గోల్ మాల్ గోవిందం`, హిందీలో `బేటీ నంబర్ వన్`.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!