ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబితా సుకుమార్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తన ఇన్ స్టాలో ఆ వేడుకల పిక్స్ పోస్ట్ చేశారు తబిత. తబిత స్వతంత్రంగా బిజినెస్ చేస్తున్నారు. ‘లాండ్రీ కార్ట్’ పేరుతో ఆన్‌లైన్ లాండ్రీ బిజినెస్ చేస్తున్నారామె. ఇన్ స్టాలో తబితకు 36 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ‘మీరు ఆత్మీయుల సన్నిధిలో ఉన్నపుడు ఏ వేడుక అయినా సరిగ్గానే జరుగుతుంది’ అంటూ తన పిక్స్ కి క్యాప్షన్ పెట్టారు తబిత.
ఇక తన భార్య కోసం తాజ్ ఫలక్ నామాలో సర్ పైజ్ పార్టీ ఇచ్చారు సుకుమార్. సుక్కు, తబిత ప్రేమ వివాహం 2009 లో జరిగింది. వీరికి సుకృతి, సుకృత్ అనే పిల్లలు ఉన్నారు. ‘రంగస్థలం’ ఈవెంట్ లో మురికితో కూడిన చరణ్ దుస్తులు చూసిన తర్వాత లాండ్రీ బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చిందట. ఇప్పటికే తబిత మూడు ‘లాండ్రీ కార్డ్’ బ్రాంచ్ లను ఏర్పాటు చేశారు. తబితలాగే మరో దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వేదిక్ పేరుతో ఆర్గానిక్ స్టోర్ నడుపుతుండగా, మరో దర్శకుడు సురేందర్ రెడ్డి వైఫ్ ఉలవచారు పేరుతో రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. మరి వీరి బాటలో ఇంకెంత మంది ప్రముఖుల భార్యలు వ్యాపారరంగంలో కాలుమోపుతారో చూడాలి.