మెగాస్టార్ చిరంజీవి, బాబీ, మైత్రీ మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మెగా154 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీజీవి, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సినిమాలోని ప్రధాన తారాగణంపై చిత్ర బృందం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది.
ఈ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈ మూవీ సెట్ కు వెళ్ళారు. సుకుమార్ సెట్ లో వున్న ఫోటోని అభిమానులతో పంచుకుకుంది చిత్ర యూనిట్. బాబీ, సుకుమార్ కి లాప్ టాప్ లో ఏదో చూపించడం, సుకుమార్ ఆసక్తికరంగా చూడటంలో ఈ ఫోటోలో ఉంది. మెగా154 మూవీ బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. తన ఆరాధ్యదైవం చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో బాబీ కల నిజమైనట్లయింది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. మెగాస్టార్‌తో శృతి హాసన్ ఈ చిత్రం కోసం తొలిసారి జతకట్టారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.