Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Mishkin Says About Andrea Jeremia Nude Scene Pisasu2 Movie

Andrea Jeremiah: నగ్నంగా నటించిన ‘పుష్ప’ సింగర్.. అన్ని కోట్లు తీసుకుందా..?

Published Date :August 28, 2022 , 3:05 pm
By Roja Pantham
Andrea Jeremiah: నగ్నంగా నటించిన ‘పుష్ప’ సింగర్.. అన్ని కోట్లు తీసుకుందా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Andrea Jeremiah: ఆండ్రియా జెరేమియా .. ఈ పేరు తెలియనివారు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో లేరు అంటే అతిశయోక్తి కాదు. సింగర్ గా, నటిగా అమ్మడు వరుస అవకాశాలను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఇటీవలే తమిళ్ పుష్ప చిత్రంలో ఊ అంటావా మావా సాంగ్ పాడి అమాంతం ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పిశాచి 2 చిత్రంలో నటిస్తోంది. 2014 లో వచ్చిన పిశాచి చిత్రంకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రంలో ఆండ్రియా కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా నటించిందని వార్తలు గుప్పుమన్న విషయం విదితమే. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు మేకర్స్ కానీ, ఆండ్రియా కానీ స్పందించింది లేదు. ఇక తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ మిస్కిన్ స్పందించారు. ఈ సీన్స్ కోసం ఆండ్రియా కొన్ని కోట్లు తీసుకున్నదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిస్కిన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ “అవును.. ఈ చిత్రంలో ఆండ్రియా నగ్నంగా నటించింది. అయితే అవి కేవలం ఫోటోలు మాత్రమే. సీన్స్ అయితే మేము తీయలేదు. ఆ ఫోటోషూట్ కూడా ఒక లేడి ఫోటోగ్రాఫర్ తీసింది. ఆ సెట్ లోకి నేను కూడా వెళ్ళలేదు. ఈ న్యూడ్ ఫోటోషూట్ కు ఆండ్రియా ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకొంది. అలా తీసుకోవడంలో కూడా తప్పు లేదఅనిపించింది. ఇక ఈ ఫొటోస్ ను సినిమాలో కూడా పెట్టలేదు. చిన్నపిల్లలతో కలిసి సినిమా చూసేవాళ్లకు ఇలాంటి ఫోటోలు అభ్యంతరకరంగా ఉంటాయి. అందులోనూ ఆ ఫోటోలు సినిమాలో చూపిస్తే సెన్సార్ దగ్గర ప్రాబ్లెమ్ అవుతోంది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇస్తారు. అందుకే వాటిని సినిమాలో చూపించడంలేదు” అని చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా నగ్నంగా నటించడానికి ఆమె ఎన్ని కోట్లు తీసుకున్నది అనేది మాత్రం దర్శకుడు రివీల్ చేయకపోవడం విశేషం. ఇక ఈ చిత్రం ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని అంటున్నారు .. కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి ఈ సినిమాతో ఈ సింగర్ కమ్ నటి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andrea jeremia
  • director mishkin
  • pisachi-2
  • pisasu 2 movie

తాజావార్తలు

  • Heroines – Weird Things : హీరోయిన్స్ విషయంలో హద్దులు దాటుతోన్న అభిమానం

  • OnePlus Nord 6: మిడ్-రేంజ్ లో కింగ్.. వన్‌ప్లస్ నార్డ్ 6 విడుదల.. 9000 mAh బ్యాటరీ

  • Botsa Satyanarayana: గవర్నర్‌కు బొత్స లేఖ.. ఆర్ధిక వ్యవహారాలపై ప్రభుత్వం తప్పుడు సమాచారం..

  • Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!

  • Smriti Mandhana and Palash Muchhal Reunite: మళ్లీ కలిసిన స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ వీడియో వైరల్‌.. పెళ్లి చేసుకోబోతున్నారా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions