The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల కోట్లు అని.. ఇన్ని కోట్లు అంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో మారుతి అసలు బడ్జెట్ ఎంతో క్లారిటీ ఇచ్చేశాడు.
Read Also : SSMB 29 : మహేశ్ బాబుతో కొత్త ప్లేస్ లో రాజమౌళి షూటింగ్..
తాజాగా బ్యూటీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ అనేవాడు చాలా క్రియేటివ్ గా ఉంటాడు. ప్రభాస్ కు నా మీద ఎంతో నమ్మకం ఉంది కాబట్టే ఈ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. రూ.400 కోట్లతో ది రాజాసాబ్ మూవీ తీస్తున్నాను. ఆ మూవీ అదిరిపోతుంది. ప్రభాస్ కు నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరం ఒకరిపై ఒకరం ఎంతో ప్రేమ చూపించుకుంటాం. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్టే సినిమా ఉంటుంది. ప్రస్తుతం బూతులు ఉంటేనే సినిమాలకు చూస్తున్నారు. కానీ అవి మంచివి కావు. కుటుంబం మొత్తం చూసేలా సినిమాలు ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు మారుతి.
Read Also : OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..
