Maruthi : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరుతి చేతుల మీదుగా పర్యవేక్షణలో ఒక సరికొత్త చిత్రం పట్టాలెక్కింది. ఆయన చిరకాల మిత్రుడు, పి.ఆర్.ఓ ఏలూరు శ్రీను నిర్మాతగా ఒక పవర్‌ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘డ్యూ డేట్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ లాంటి భారీ సినిమా తర్వాత వచ్చిన నెగిటివిటీ అనంతరం తొలిసారి మీడియా ముందుకు రావడం ఈ పూజా కార్యక్రమాలతోనే కావడం విశేషం.
వరిష్ స్టూడియోస్, ఆనంద్ స్టోరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ముహూర్తపు వేడుక టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు ఈ వేడుకకు విచ్చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. నిర్మాతలు ఎస్.కె.ఎన్ (SKN), డి. మొగిలినేని, వంశీ చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ చిత్రానికి కెమెరా స్విచ్చాన్ చేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో పవన్ తరిగోపుల, చెంచు జింక, లోమేష్ పుడిపెద్ది, జయశ్రీ మహేంధర్, ప్రణీత పట్నాయక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. పి. విజ్ఞాని, సాంకేతిక విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

