Maruthi: నవతరం మెచ్చిన మారుతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruthi:నవతరం మెచ్చే చిత్రాలను తీస్తూ, తనదైన బాణీ పలికించారు దర్శకుడు మారుతి. కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా మారుతి సక్సెస్ రూటులో సాగారు. యువతను ఆకట్టుకొనే అంశాలను చొప్పించి, జనాన్ని మెప్పించడంలో మేటిగా నిలిచారు మారుతి.
మచిలీపట్నంలో 1973 అక్టోబర్ 8న దాసరి మారుతి జన్మించారు. బందరులోనే విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ కు వచ్చి యానిమేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత వెహికల్స్ కు సైన్ బోర్డ్స్, నంబర్ ప్లేట్స్ చేస్తూ జీవనం సాగించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపై ఆసక్తి ఉంది. దాంతో చిత్రసీమవైపు కూడా పయనం సాగించాలని తపించారు. తమిళంలో విజయం సాధించిన ‘కాదల్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో మిత్రులతో కలసి అనువదించారు మారుతి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రామ్ గోపాల్ వర్మ 5డి కెమెరాతో లో బడ్జెట్ మూవీగా ‘దొంగలముఠా’ చిత్రాన్ని తెరకెక్కించారు. దానిని చూసిన తరువాత తక్కువ పెట్టుబడితో చిత్రాలు నిర్మించవచ్చు అనే నమ్మకం మారుతికి కూడా కలిగింది. బడ్జెట్ కు తగ్గ కథను తయారు చేసుకున్నారు. దానినే ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంగా తెరకెక్కించారు మారుతి. యాభై లక్షల్లో రూపొందిన ‘ఈ రోజుల్లో’ సక్సెస్ సాధించింది. తరువాత కుర్రకారుకు కిర్రెక్కిస్తూ ‘బస్టాప్’ తెరకెక్కించారు మారుతి. అది కూడా ఆకట్టుకుంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘ప్రేమకథా చిత్రం’ కథను రాసి, ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు మారుతి. అది అనూహ్య విజయం సాధించింది. తరువాత యువతనే లక్ష్యంగా చేసుకొని “రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్” వంటి చిత్రాలను నిర్మించారు. అల్లు శిరీష్ హీరోగా ‘కొత్త జంట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మారుతి లోని టాలెంట్ చూసిన అల్లు అరవింద్ మరో అవకాశం కల్పించారు. తత్ఫలితంగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రూపొందింది. ఈ సినిమా దర్శకునిగా మారుతికి మరింత పేరు తెచ్చింది. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ రూపొందించారు మారుతి. శర్వానంద్ తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’, సాయిధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలను తెరకెక్కించారు మారుతి. సంతోష్ శోభన్ తో ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమా రూపొందించారు. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. ఈ సారి మళ్ళీ తనదైన బాణీ పలికిస్తూ మారుతి ఏ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?