Director Madan: ప్రముఖ దర్శకుడు మదన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కి గురైన ఆయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. దర్శకుడు మదన్ స్వస్థలం మదనపల్లి. ‘ఆ నలుగురు’ సినిమాతో రచయితగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. పెళ్లయిన కొత్తలో సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తిన మదన్.. ‘‘గుండె ఝల్లుమంది’’, ‘‘ప్రవరాఖ్యుడు’’, ‘‘కాఫీ విత్ మై వైఫ్’’, ‘‘గరం’’, ‘‘గాయత్రి’’ తదితర సినిమాలను రూపొందించారు. ఈయన హఠాన్మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.