కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ విలన్గా కనిపించనున్నారు. ఈ సినిమాలో హుమా ఖురేషి కథానాయిక. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
Read Also : Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్
‘వలీమై’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హెచ్ వినోద్ మాట్లాడుతూ ‘వలీమై’ మూవీ అంతకుముందు వచ్చిన ‘ఖాకీ’ కంటే మంచి థ్రిల్ ను ఇస్తుందని, ‘భీమ్లా నాయక్’ కంటే ముందే ‘వలీమై’ను చూడాలని కోరారు. ఒకవేళ 24న టికెట్లు దొరకకపోతే ఆ తరువాత సినిమాను చూడాలని చెప్పుకొచ్చారు. యాక్షన్ లో గానీ, సెంటిమెంట్ లో గానీ అన్ని రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని హామీ ఇచ్చారు.