ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ మూవీ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళింది. ఇదే సమయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాల్సిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ దగ్గరకి వచ్చింది. అలా RC 16 అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయిపోయాడు. మామన్నన్ ప్రమోషన్స్ లో రెహమాన్ స్వయంగా రామ్ చరణ్ సినిమాకి వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. ఇక తాజాగా బేబీ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా… ఆర్సీ 16 అదిరిపోతుందని చెప్పాడు డైరెక్టర్ బుచ్చిబాబు.
దీంతో ఆర్సీ 16 పై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి, అయితే టెక్నీషియన్స్ ఫైనల్ అవుతున్నారు కానీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది అంటూ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది జాన్వీ. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం… సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ముందు నుంచి జాన్వీతో పాటు మృణాల్ పేరు కూడా వినిపిస్తునే ఉంది. ఇన్ని రోజులు ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనే డైలమాలో ఉన్న మేకర్స్… ఫైనల్‌గా జాన్వీ కాకుండా మృణాల్ ఠాకూర్‌కు ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే ఆర్సీ 16 స్టార్ క్యాస్టింగ్ పై అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. విజయ్ సేతుపతి RC 16లో నటిస్తుండడంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.