Director Aditya Hassan got two movie offers: #90స్ అనే వెబ్ సిరీస్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు ఆదిత్య హాసన్. నవీన్ మేడారం సమర్పకుడిగా వ్యవహరిస్తూ ఆయన సోదరుడు రాజశేఖర్ చేత నిర్మింప చేసిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్. అప్పటి కిడ్స్ అందరికీ బాగా కనెక్ట్ అయిపోయిన ఈ వెబ్ సిరీస్ తర్వాత ఆయనకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ఆయనకు రెండు సినిమా అవకాశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ రెండు సినిమా అవకాశాలు కూడా పెద్ద బ్యానర్ ల నుంచి అని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొదటి బ్యానర్ హీరో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట్ మూవీస్. ఈ వెబ్ సిరీస్ పూర్తిగా కామెడీ జానర్ లో ఉన్న నేపథ్యంలో అలాంటి మంచి కామెడీ స్క్రిప్ట్ ఒకటి నితిన్ కోసం సిద్ధం చేసుకోమని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది.
Sai Pallavi: ఆ విషయంలో అక్కనే మించిపోయావ్ గా పూజా.. నెక్స్ట్ లెవెల్ అంతే
అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ కూడా ఈ వెబ్ సిరీస్ చూసి ఇంప్రెస్ అయ్యి తమ బ్యానర్ లో ఒక సినిమా చేసే అవకాశం ఆదిత్య హాసన్ కి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ముందుగా నితిన్ తో సినిమా చేయడానికి ఆదిత్య ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనిమీద పూర్తిగా నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. నితిన్ సినిమా పూర్తి అయిన తర్వాత ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ కోసం ఒక సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే సితార సంస్థలో హీరోగా ఎవరు నటిస్తారని విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ కూడా ఉంటుందని, సిరీస్ చివరలో క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య జరిగిన ప్రమోషన్స్ లో కూడా సెకండ్ పార్ట్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు మేకర్స్. ఇప్పుడు సినిమా అవకాశాలు రావడంతో ఆయనే వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్ డైరెక్ట్ చేస్తారా? లేక ఇంకా ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయం ఎందుకు క్లారిటీ రావాల్సి ఉంది.