Dil Raju Strong Warning to Websites over Cookedup Stories: సంక్రాంతి సినిమాల రిలీజ్ డేట్లు, థియేటర్ల అంశం మీద దిల్ రాజు ఘాటుగా స్పందించారు. ఒక చిన్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ఈ విషయం మీద మాట్లాడారు. మీడియాకి నా పర్సనల్ స్టేట్మెంట్ అని మొదలు పెట్టిన ఆయన ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, అలా రిలీజ్ అవుతున్నప్పుడల్లా కష్టపడి ఈ స్థాయికి వచ్చినందుకు డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా నా మీద కాంట్రవర్సీలు చేస్తూ రాళ్లు వేస్తున్నారు. ఆల్మోస్ట్ అది మీ అందరికీ తెలియనిది కాదు, ఎందుకంటే ఇది ఏడెనిమిదేళ్ల నుంచి నడుస్తూనే ఉంది. నిన్న కూడా చిరంజీవి గారు నాపై మాట్లాడిన మాటలకు కొన్ని వెబ్ సైట్లు తప్పుగా వక్రీకరించాయని పేర్కొన్న ఆయన నాపై తప్పుడు వార్తలు రాస్తే వెబ్ సైట్ల తాటతీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
MM Keeravaani: మహేష్ బాబు సినిమా అప్డేట్ అడిగితే, ఫోన్ స్విచ్ఛాఫ్!
వ్యాపార పరంగా వచ్చే విమర్శలను వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఇప్పటివరకు ఊరుకున్నా అనీ ఈరోజు నుంచి ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఇక తమిళ సినిమాను నేనే వాయిదా వేశా, హను-మాన్ సినిమా విడుదల చేయాలని నేనే చెప్పానని ఆయన పేర్కొన్నారు. నైజాంలో హనుమాన్ , గుంటూరు కారం సినిమాలకు థియేటర్లు ఉన్నాయని, నాగార్జున, వెంకటేశ్ సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని అన్నారు. అలాగే మీ తప్పుడు రాతలతో ఏం చేద్దామనుకుంటున్నారు? నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా కదా ఏదైనా ఉంటే తనను సంప్రదించి వార్తలు రాయాలని అన్నారు. మీ వైబ్ సైట్లకు నన్ను వాడుకుంటే తాటతీస్తా అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.