OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ ఎట్టకేలకు హిట్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత పవన్ కు సరైన సినిమా పడిందంటున్నారు ఫ్యాన్స్. థియేటర్ల దగ్గర రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. ఇమ్రాన్ హష్మీ విలనిజం ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో సౌత్ కు మరో మంచి విలన్ దొరికాడు అనే ఫీలింగ్ లో ఉన్నారు ప్రేక్షకులు. అయితే ఇంత పవర్ ఫుల్ విలన్ రోల్ కు ముందుగా వేరే హీరోను తీసుకోవాలని అనుకున్నారంట. అతను ఎవరో కాదు ఆది పినిశెట్టి. ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రకు అతను సరిగ్గా సరిపోతాడని అనుకున్నారంట. కానీ ఓజీని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలని అనుకోలేదు సుజీత్.
Read Also : Sujith : ఎవరీ సుజీత్.. అతని ఆస్తులు, చదువు ఏంటంటే..?
అందుకే చివరకు బాలీవుడ్ లో ఇమేజ్ ఉన్న నటుడు కావాలని ఇమ్రాన్ హష్మీని తీసుకున్నాడు. ఒకవేళ ఓజీకి మంచి హిట్ టాక్ వస్తే బాలీవుడ్ లో రిలీజ్ చేయొచ్చన్నది ఆయన ఉద్దేశం. అప్పుడు బాలీవుడ్ నటుడు ఉంటే ఈజీగా ప్రమోషన్ అయిపోతుందనేది ఆయన ఉద్దేశం. అందుకే ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీని తీసుకున్నారంట. సుజీత్ నిర్ణయం ఇప్పుడు కరెక్టే అయింది. ఓజీకి మంచి హిట్ టాక్ వచ్చింది. అలాగే ఇమ్రాన్ విలనిజం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓజీ సినిమాతో సుజీత్ కు మంచి దారి దొరికింది. ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలు మూడే అయినా.. అందులో రెండు పెద్ద హీరోలవే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత అతనికి మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
Read Also : OG : ఓజీ మూవీ టీమ్ కు హైకోర్టులో ఊరట..
