నాని ‘ఎఫ్ 2’ వదిలేసి తప్పు చేశాడా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి బియ్యపుగింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందట. అలాగే ఏ సినిమా ఏ హీరో ఖాతాలో పడాలనేది కూడా ఆ భగవంతుడు నిర్ణయించినట్లే జరుగుతుంది. ఎంతో మంది తారలు తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు. అందుకు ఉదాహరణలు కో కొల్లలు. నేచురల్ స్టార్ నానికి కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘ఎఫ్ 2’, ‘రాజా రాణి’ సినిమాలు ప్రత్యేకమైనవి. ఈ సినిమాల మేకర్స్ తమ సినిమాలో నటించమని నానిని అడిగారట. అయితే బిజీగా ఉండటం వల్లనో లేక పారితోషికం తదితర ఇతర విషయాల వల్లనో అవి నానీ కిట్టిలోంచి జారిపోయాయి. తన అప్ కమింగ్ రిలీజ్ ‘టక్ జగదీష్’ ప్రచారంలో ఉన్న నానికి ఈ సినిమాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం తను ఉన్న స్థాయి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు నాని. తొలి చిత్రం ‘అష్టా చెమ్మ’ నుండి గత చిత్రం ‘వి’ వరకు చేసిన ప్రతి సినిమాని ఎంజాయ్ చేశానని అంటున్నాడు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అవుతాయని తెలిసినప్పటికీ తిరస్కరించానంటున్నాడు. అందులో ‘ఎఫ్ 2’, ‘రాజా రాణి’ ఉన్నట్లు అంగీకరించాడు. ఆ యా చిత్రాల నిర్మాతలు సంప్రదించారని, అయితే ఆ టైమ్ లో వాటిలో నటించే పరిస్థితిలో తను లేకపోవడం వల్ల తిరస్కరించానంటున్నాడు. ఇక ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన తన గత చిత్రం ‘వి’ ఫలితం పట్ల సంతోషంగానే ఉన్నాడట. నిర్మాత దిల్ రాజుతో పాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్, చూసిన ప్రేక్షకులు అందరూ సంతోషంగానే ఉన్నారని… అయినా ప్లాఫ్ అని ఎందుకు అంటున్నారో తనకు అర్థం కావటంలేదంటున్నాడు నాని. మరి వినాయకచవితి కానుకగా వస్తున్న ‘టక్ జగదీష్’ అయినా నాని నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ కథానాయికలు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
తాజావార్తలు
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!