Site icon NTV Telugu

Dhurandhar: సౌత్ కోటకు బీటలు: టాప్-4లోకి రణవీర్ ఎంట్రీ.. షేక్ అవుతున్న ఇండియన్ బాక్సాఫీస్!

Dhurandhar

Dhurandhar

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబడింది, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. భారతదేశంలోనే ఏకంగా ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది, ఇప్పటివరకు బాలీవుడ్ తరపున అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (₹760 కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్’ తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో మొత్తం ₹1002 కోట్ల గ్రాస్ వసూళ్లతో దూసుకుపోతోంది, తద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మైలురాయిని అందుకున్న మూడవ చిత్రంగా నిలిచింది.

Also Read:Mollywood : మళ్లీ సొంత ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న స్టార్ హీరో

భారతీయ సినీ చరిత్రలో ₹1000 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాల జాబితాను గమనిస్తే, ‘ధురంధర్’ మినహా మిగిలినవన్నీ సౌత్ చిత్రాలే కావడం విశేషం. ప్రస్తుతం దేశీయ వసూళ్లలో టాప్ 4 స్థానాల్లో ఉన్న సినిమాలను పరిశీలిద్దాం . పుష్ప 2: ద రూల్ ₹1471 కోట్లు, బాహుబలి 2: ద కన్ క్లూజన్ ₹1417 కోట్లు, ధురంధర్ ₹1002 కోట్లు, KGF: చాప్టర్ 2 | ₹1001 కోట్లు. గతంలో వెయ్యి కోట్లు సాధించిన సౌత్ చిత్రాలన్నీ భారీ స్థాయిలో మల్టీ-లాంగ్వేజ్ (పాన్ ఇండియా) విడుదలతో ఆ మార్కును అందుకున్నాయి కానీ, ‘ధురంధర్’ ప్రధానంగా తన ఒరిజినల్ హిందీ వెర్షన్ ద్వారానే ఈ స్థాయి వసూళ్లను సాధించి, సింగిల్ లాంగ్వేజ్‌లో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించడం విశేషం.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్, రణవీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా, బాలీవుడ్ బాక్సాఫీస్ సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.

Exit mobile version