Site icon NTV Telugu

Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?

Dhurandhar 2

Dhurandhar 2

సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది? సినిమాలలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ల వెనుక ఉన్న కష్టం ఎంత? అనేవి సినిమా టీమ్స్ ప్రమోషన్ కోసం చేసిన చిన్న చిన్న క్లిప్పులు సాధారణంగా మనం యూట్యూబ్‌లో చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఓ డైరెక్టర్ ఒక అద్భుతమైన ప్రయోగానికి తెరలేపాడు. రణవీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే జోష్‌తో అభిమానులకు ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు టీమ్ సిద్ధమైంది. సాధారణంగా మేకింగ్ వీడియోలను సినిమా ప్రమోషన్ కోసం వాడతారు.

Also Read :Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?

కానీ, ‘ధురంధర్’ మేకర్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఈ సినిమా నిర్మాణ విశేషాలతో కూడిన ఒక పూర్తిస్థాయి డాక్యుమెంటరీని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ భారతీయ సినిమా చరిత్రలో, ముఖ్యంగా బాలీవుడ్‌లో ఒక సినిమా మేకింగ్‌ను వెండితెరపై ప్రదర్శించడం చాలా అరుదైన విషయం. ఈ డాక్యుమెంటరీలో ప్రధానంగా సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను ఎలా చిత్రీకరించారో చూపించబోతున్నారు. రణవీర్ సింగ్ పడ్డ కష్టం, ఆదిత్య ధర్ విజన్, మరియు టెక్నీషియన్లు ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా చూపించడానికి చేసిన కృషిని కళ్లకు కట్టినట్లు వివరించనున్నారు. రిస్కీ స్టంట్స్ వెనుక ఉన్న రియాలిటీ, సెట్స్‌లో రణవీర్, ఆదిత్య ధర్ మధ్య జరిగిన క్రియేటివ్ చర్చలు అందులో భాగం చేయన్నున్నారు. అయితే ఈ వినూత్న ప్రయత్నం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందనను రాబడుతుందో చూడాలి.

Exit mobile version