Dhimahi First Poster Released: ఈమధ్య కాలంలో హిందుత్వ సంప్రదాయాలను చూపిస్తున్న సినిమలు సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అఖండ, కార్తికేయ 2, కాంతార ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి ఒక సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. 7:11 PM సినిమాలో హీరోగా నటించిన ఫేమ్ సాహస్ పగడాల హీరోగా కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ బ్యానర్ పై’ధీమహి’ సినిమా రూపొందింది. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సాహస్ పగడాల, నవీన్ కంటె దర్శకులుగా వ్యవహరించారు. ఈ సినిమాలో నిఖిత చోప్రా హీరోయిన్ గా నటించింది. షారోన్ రవి సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ కూ వెళ్లేందుకు ఫస్ట్ కాపీతో సిద్ధంగా ఉంది.
Nenu Super Woman: ”ఆహా” అనిపిస్తున్న ”నేను సూపర్ ఉమన్”..3 వారాల్లో 3 కోట్ల 90 లక్షల పెట్టుబడులు
ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో మేకర్స్ మాట్లాడుతూ “ధీమహి చాలా కొత్తగా ఉంటుందని, 7:11 PM సినిమాలో నటించిన సాహస్ పగడాల ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహించారని వెల్లడించారు. మా సినిమా ఒక థ్రిల్లర్ అని షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి అయిందని అన్నారు. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ త్వరలో జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉన్నామని పేర్కొన్న మేకర్స్ సినిమా చాలా కొత్తగా ఉంటుందని, త్వరలోనే ట్రైలర్ తో మీ ముందుకు వస్తామని అన్నారు. ఇక మంచి రిలీజ్ డేట్ చూసుకుని సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. ఈ సినిమాకి సంతోష్ కామిరెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ షారోన్ రావి అందిస్తున్నారు.