Dhimahi First Poster Released: ఈమధ్య కాలంలో హిందుత్వ సంప్రదాయాలను చూపిస్తున్న సినిమలు సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అఖండ, కార్తికేయ 2, కాంతార ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో అలాంటి ఒక సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. 7:11 PM సినిమాలో హీరోగా నటించిన ఫేమ్ సాహస్ పగడాల హీరోగా కెప్టెన్ కుక్ ఫిలిమ్స్ బ్యానర్ పై’ధీమహి’ సినిమా రూపొందింది. విరాట్ కపూర్, సాహస్ పగడాల సంయుక్తంగా…