ఈ యేడాది ఇప్పటికే ధనుష్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ‘కర్ణన్’ మూవీ ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్ అయితే, జూన్ 18న ‘జగమే తంత్రం’ ఓటీటీ ద్వారా జనం ముందుకొచ్చింది. ఇప్పుడు సెట్స్ మీద దాదాపు మూడు నాలుగు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. హిందీ సినిమా ‘అత్రంగి రే’, తమిళ చిత్రాలు ‘నానే వరువెన్’, ‘ఆయిరిత్తల్ ఒరువన్ -2’తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త్రిభాషా చిత్రం చేయడానికీ ధనుష్ కమిట్ అయ్యాడు.
Read Also : ఈ హీరోయిన్ నూ వదలని వర్మ.. “డియర్ మేఘ” అంటూ రచ్చ!
ఇదిలా ఉంటే… సత్య జ్యోతి ఫిలిమ్స్ సంస్థ ధనుష్ హీరోగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘మారన్’ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. తాజాగా మూడో షెడ్యూల్ ను ఆగస్ట్ 27 నుండి హైదరాబాద్ లో జరుపుతున్నారు. ధనుష్ కు జంటగా మాళవిక మోహనన్ నటిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ లో సముతిర ఖని, స్మృతి వెంకట్, మహేంద్రన్, కృష్ణ కుమార్ బాలసుబ్రహ్మణ్యన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ధనుష్ 44వ చిత్రానికి ‘తిరుచిత్రంబలన్’ అనే పేరు ఖరారు చేశారు. మిత్రన్ జవహర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ధనుష్ – మిత్రన్ 13 సంవత్సరాల తర్వాత మరోసారి జత కట్టినట్టు అయ్యింది. మొత్తం మీద ధనుష్ వేగం ఆషామాషీగా లేదు!