Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Dharmendra 87th Birthday Special

Dharmendra: బాలీవుడ్ ఫస్ట్ ‘హీ-మేన్’ అంటే అతడే!

Published Date :December 8, 2022 , 6:15 am
By Prasanna Pradeep
Dharmendra: బాలీవుడ్ ఫస్ట్ ‘హీ-మేన్’ అంటే అతడే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dharmendra: ‘హీ-మేన్’ అనే పదం ఆంగ్లసాహిత్యంతో పరిచయం ఉన్న ఆబాలగోపాలానికీ సుపరిచితం! బాలీవుడ్ లో ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న తొలి స్టార్ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. ఆ రోజుల్లో ధర్మేంద్ర శరీరసౌష్టవం చూసి ఎంతోమంది ఆయనను ‘ఫస్ట్ హీ-మేన్ ఆఫ్ హిందీ సినిమా’ అనేవారు. నిజానికి ధర్మేంద్ర కంటే ముందే తమ కండలతో అలరించిన నటులు లేకపోలేదు. కానీ, ‘హీ-మేన్’ ఇమేజ్ తో ధర్మేంద్ర మహిళల మానసచోరుడిగా సాగారు. అంతేకాదు, నాటి మేటి నాయికల మదినీ దోచారు. ఇక ‘డ్రీమ్ గర్ల్’ గా జేజేలు అందుకున్న హేమామాలిని మనసును సైతం గెలుచుకొని తన వలపును పండించుకున్నారు ఈ హీమేన్!

ధర్మేంద్ర అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్. 1935 డిసెంబర్ 8న పంజాబ్ లోని నస్రాలీలో ఆయన జన్మించారు. లూధియానా పట్టణ సమీపంలోని లాల్టోన్ కలాన్ అనే గ్రామం ప్రాథమిక పాఠశాలలో ధర్మేంద్ర తండ్రి ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు. అక్కడే ధర్మేంద్ర ప్రాథమిక విద్య సాగింది. 1952లో ధర్మేంద్ర మెట్రిక్యులేషన్ పాసయ్యారు. అప్పటి నుంచీ నాటకాలు వేస్తూ సాగారు. అప్పట్లో ‘ఫిలిమ్ ఫేర్’ మేగజైన్ కొత్తవారిలో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమం చేపట్టింది. అందులో ధర్మేంద్ర విజేతగా నిలిచారు. దాంతో కొందరు బొంబాయికి వస్తే సినిమా అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ‘ఫిలిమ్ ఫేర్’ న్యూ టాలెంట్ విన్నర్ గా బొంబాయి చేరిన ధర్మేంద్రకు నిరాశ ఎదురయింది. అయితే పట్టువదలకుండా అక్కడే వేట సాగించారు. ఆ సమయంలో అర్జున్ హింగోరానీ అనే దర్శకుడు ధర్మేంద్ర పర్సనాలిటీ చూసి, తన సినిమాలో హీరోగా అవకాశం కల్పించారు. ఆ చిత్రమే ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరే’. అందులో బలరాజ్ సహానీ వంటి మేటి నటునితో కలసి నటించారు ధర్మేంద్ర. కుమ్ కుమ్ నాయికగా కనిపించిన ఈ చిత్రంలో ఆయన పేరును ధర్మేందర్ గా టైటిల్ వేశారు. తరువాత కొన్ని చిత్రాలలో సైడ్ హీరోగానూ నటించారు. 1962లో వచ్చిన ‘అన్ పడ్’ ధర్మేంద్రకు బ్రేక్ నిచ్చింది. 1966లో తెరకెక్కిన ‘ఫూల్ ఔర్ పత్థర్’తో ధర్మేంద్రకు స్టార్ డమ్ లభించింది.

నూతన్ తో ధర్మేంద్ర నటించిన “సూరత్ ఔర్ శీరత్, బందినీ, దిల్ నే ఫిర్ యాద్ కియా, దుల్హన్ ఏక్ రాత్ కీ” చిత్రాలు ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. అలాగే మాలా సిన్హాతో ధర్మేంద్ర అభినయించిన “అన్ పడ్, పూజా కే ఫూల్, బహారే ఫిర్ భీ ఆయేగీ, ఆంఖే” చిత్రాలు జనాన్ని అలరించాయి. ఆయన కంటే సీనియర్ నటి అయిన మీనా కుమారితో ధర్మేంద్ర ఏడు చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు. వీరిద్దరూ నటించిన “మై భీ లడ్కీ హూ, కాజల్, పూర్ణిమ, ఫూల్ ఔర్ పత్థర్, మజ్లీ దీదీ, చందన్ కా పాలనా, బహారోంకీ మంజిల్” సినిమాలు విశేషాదరణ చూరగొన్నాయి. వీరిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉందన్న వదంతులు అప్పట్లో విశేషంగా వినిపించాయి. హృషీకేశ్ ముఖర్జీ తెరకెక్కించిన ‘అనుపమ’లో ధర్మేంద్ర అభినయం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక 1970ల ఆరంభంలో హేమామాలినితో జోడీ కట్టడం ఆరంభించారు ధర్మేంద్ర. వారిద్దరి జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. “రాజా-జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్థర్ ఔర్ పాయల్, తుమ్ హసీన్ మై జవాన్, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, దోస్త్, మా, ఆజాద్” వంటి చిత్రాలలో ధర్మేంద్ర, హేమామాలిని జంట జనానికి నయనానందం కలిగించడమే కాదు, జైత్రయాత్రలూ చూశారు. ఆ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ అంకురించింది. అప్పటికే ధర్మేంద్రకు పెళ్ళయి పిల్లలు ఉన్నా, హేమ మనసు ఆయనతో జీవితాన్ని కోరుకుంది. తత్ఫలితంగా 1980లో వీరు వివాహం చేసుకున్నారు. వారికి ఇషా డియోల్, అహనా డియోల్ పిల్లలు. ఇక ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాశ్ కౌర్ పిల్లల్లో సన్నీ డియోల్, బాబీ డియోల్ సైతం హీరోలుగా అలరించారు. తన తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ చిత్రాలు నిర్మించారు. సన్నీతో ‘బేతాబ్’, బాబీతో ‘బర్సాత్’ తెరకెక్కించారు. ఇవి కాకుండా మరికొన్ని చిత్రాలనూ తమ విజేత ఫిలిమ్స్ పతాకంపై నిర్మించారాయన. వాటిలో తనయుడు సన్నీతో నిర్మించిన ‘ఘాయల్’ మంచి పేరు సంపాదించి పెట్టింది.

ధర్మేంద్ర రాజకీయాల్లోనూ రాణించారు. 2004లో రాజస్థాన్ బికనీర్ నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. తనయులతో కలసి చివరగా ‘యమ్లా పగ్లా దీవానా’లో నటించారాయన. 2012లో ఆయనకు ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ధర్మేంద్ర మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. డిసెంబర్ 8తో 87 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ధర్మేంద్ర ఏ సినిమాతో మళ్ళీ తెరపై కనిపిస్తారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood First He Man
  • Dharmendra
  • dharmendra birthday
  • Dharmendra Movies

తాజావార్తలు

  • Monalisa: “మోనాలిసా 35 ముక్కలుగా దొరుకుతుంది”.. సాధ్వీ ప్రాచీ సంచలన వ్యాఖ్యలు..

  • Allu Aravind: ఆ రెండు కారణాలతోనే అల్లు సినిమాస్ నిర్మించా

  • Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

  • Anushka : పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే?

  • Malaika Arora: కొడుకు కన్నా పదేళ్లు పెద్దోడితో బాలీవుడ్ హాట్ భామ డేటింగ్..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions