Chandrabose: ‘రంగస్థలం’ తర్వాత ఆ కిక్ ఇచ్చింది ఈ సినిమానే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పొలిటికల్ ఎంటర్టైనర్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల లాంటి భారీ తారాగణంతో రూపొందిన యూనిక్ మూవీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఈవెంట్ లో ఆస్కార్ గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రానికి ఐదు అద్భుతమైన పాటలు రాసిన ఆయన.. “రామ్‌చరణ్ ‘రంగస్థలం’ తర్వాత పాటల పరంగా నాకు అంతటి అపారమైన సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిన ఏకైక చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’” అని కుండబద్దలు కొట్టారు. డబ్బులు వచ్చేలా తీస్తేనే మంచి సినిమా అనే భ్రమలను వదిలి, మంచి సినిమా తీస్తే డబ్బులొస్తాయని నమ్మి దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారని ప్రశంసించారు. గత కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నటి వితికా షేరు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ తో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె పాత్రపై చంద్రబోస్ మాట్లాడుతూ.. ఒకప్పటి బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రతిఘటన’లో విజయశాంతికి ఎలాంటి ఐకానిక్ క్యారెక్టర్ లభించిందో, ఈ చిత్రంలో వితికకు అలాంటి పవర్ ఫుల్ రోల్ లభించిందని, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని చెప్పి క్యూరియాసిటీని పెంచేశారు. కేవలం పాటలు, కథ విన్న వెంటనే ఈ సినిమాకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని వితిక స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..