హీరో ధర్మ మహేష్ భార్య, ప్రముఖ యూట్యూబర్ గౌతమి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఆమె ఆరోపణల ప్రకారం, ధర్మ మహేష్ సినిమాల్లో హీరోగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో తన భార్యపై విలన్ లా ప్రవర్తిస్తున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రి వరకు ఇతర అమ్మాయిలతో సమయాన్ని గడిపి, ఆమెను నిరంతరం బెదిరించేవాడని గౌతమి చెప్పింది.
Also Read : Kriti Sanon : ‘కాక్‌టెయిల్ 2’లో కృతి సనన్ స్పెషల్ ఎంట్రీ!
గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తనపై హానిచేయాలని ప్లాన్ చేశాడని, పిల్లాడు పుట్టిన తర్వాత తన కొడుకును కుటుంబంలో కలపకపోవడం, తన డబ్బు, హోటల్ లాభాలను మాత్రమే స్వాధీనం చేసుకోవడం, తనను బెడ్‌రూంలోకి రాకుండా చేయడం వంటి ఘోర చర్యలతో ఆమెను వేధిస్తున్నాడని ఆమె వెల్లడించారు. అదనంగా, బిగ్ బాస్ షోలో ఉన్న అమ్మాయిల వీడియోలను ఆమెకు పంపి శారీరక హింసకి ఉపయోగిస్తున్నాడని గౌతమి పేర్కొన్నారు.
ఇవి తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, మహేష్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదని, తనకు మంత్రులు, ముఖ్యమంత్రులు తెలిసి ఉన్నట్లు చెప్పి బెదిరిస్తున్నాడని ఆమె చెప్పారు. అలాగే, తనను.. తన కుటుంబాన్ని తుపాకులతో కాల్చి చంపుతా అని కూడా బెదిరించాడు అని తెలిపింది.
ఈ షాకింగ్ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహేష్‌పై గౌతమి చేసిన ఆరోపణలపై కేసు ఎలా ముందుకు వెళ్తుందో, పోలీస్ విచారణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
