కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ వారి నుంచి వచ్చిన ప్రకటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు అంటూ వార్తలు వచ్చినప్పటికీ, వాటి గురించి ఇంకా స్పష్టత లేదు. ఇదిలా ఉండగా మొదటిసారిగా ధనుష్ తన పిల్లలతో కలిసి పబ్లిక్ గా కన్పించారు. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య దంపతులకు యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరితో కలిస్ ధనుష్ చెన్నైలోని రాక్ విత్ రాజా కచేరీలో మొదటిసారి బహిరంగంగా కనిపించాడు. ధనుష్ ఈ కాన్సర్ట్ లో తెల్లటి సాంప్రదాయ దుస్తులను ధరించాడు. వేదికపైకి వెళ్ళి పాట కూడా పాడాడు.
Read Also : Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్
ధనుష్ పెద్ద కొడుకైతే అచ్చుగుద్దినట్టుగా ధనుష్ లాగే కనిపిస్తున్నాడు. ధనుష్ తో పాటు పిల్లలిద్దరూ ఈ ఈవెంట్ ను బాగా ఎంజాయ్ చేశారు. ఇక ధనుష్ సినిమాల విషయానికొస్తే… ఇటీవలే “మారన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన నెక్స్ట్ మూవీ “సర్” షూటింగ్ లో ధనుష్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ధనుష్ తన మాజీ భార్య ఐశ్వర్యను ఫ్రెండ్ అని పేర్కొంటూ, తన మ్యూజిక్ వీడియో ‘పయాని’ని విడుదల చేసినందుకు ఆమెను అభినందించారు.