Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!

Siva Nirvana

Siva Nirvana

Siva Nirvana: డైరెక్టర్ శివ నిర్వాణ, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటోంది. ఈ సక్సెస్‌తో ఇప్పుడు అందరి దృష్టి శివ నిర్వాణ తదుపరి ప్రాజెక్ట్‌పై పడింది. ఆయన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందనే చర్చ టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో ధనుష్‌తో శివ నిర్వాణ జట్టు కట్టబోతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలున్నాయనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన చర్చలు ‘ఇరుముడి’ కంటే ముందే మొదలైనట్లు తెలుస్తోంది. ధనుష్‌తో శివ నిర్వాణ ఇప్పటికే కథా చర్చలు జరిపినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ధనుష్ లాంటి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోతో శివ ఎలాంటి కథను చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ధనుష్, శివ నిర్వాణ కాంబినేషన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ ఆసక్తి ఏర్పడే అవకాశం ఉంది. ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు పెరిగే అవకాశముంది. మరోవైపు ‘ఇరుముడి’ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించే సినిమా కావడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్లస్ పాయింట్‌గా మారనుందని చెబుతున్నారు. ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.