తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నాడు ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు పర్ఫెక్ట్ యాక్టర్ అనే ఇమేజ్ ని కూడా మైంటైన్ చేస్తున్న ధనుష్, తెలుగులో మొదటిసారి చేసిన సినిమా ‘సార్’. తమిళ్ లో ‘వాతి’గా రిలీజ్ అయిన ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. వెంకీ అట్లూరి తెలుగులో ధనుష్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. అన్ని సెంటర్స్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘సార్’ సినిమా ఇప్పటికీ కొన్ని సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. సోషల్ కాజ్ ఉన్న సార్ సినిమా ధనుష్ కి తెలుగులో సాలిడ్ డెబ్యు ఇచ్చింది. విజయ్, కార్తి, సూర్య, రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలకి తెలుగులో ఎప్పటినుంచో మార్కెట్ ఉంది కానీ ధనుష్ మొదటి సినిమాతోనే క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరూ ఇవ్వలేకపోయారు.
Read Also: RC 15: సిఈవో వస్తున్నాడు… ఆ సినిమా డబ్బులన్నీ జనసేనకే?
ఇప్పటివరకూ సార్ సినిమా తెలుగు తమిళ భాషల్లో కలిపి వంద కోట్లకి పైగానే రాబట్టింది. ఇందులో ఎక్కువ శాతం కలెక్షన్స్ తెలుగు నుంచే వచ్చినవి కావడం విశేషం. కొత్త సినిమాల విడుదలతో సార్ సినిమాకి కాస్త థియేటర్స్ కౌంట్ తగ్గాయి. దాదాపు సార్ సినిమా థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో, ఒటీటీలో ప్రత్యక్షం అయిపొయింది. ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో సార్ సినిమా, వాటి సినిమా ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతున్నాయి. థియేటర్ లో ధనుష్ యాక్టింగ్ ని మిస్ అయిన వాళ్లు ఇంట్లో కూర్చోని చూస్తూ ఈ వీక్ ఎండ్ ని ఎంజాయ్ చెయ్యండి.