Sree Venkateswara Cinemas: ధనుష్, శేఖర్ కమ్ముల మూవీ ఉన్నట్టా? లేనట్టా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shekhar Kammula: ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమా ‘లవ్ స్టోరీ’ 2021 సెప్టెంబర్ 24న విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ సినిమా గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంది. అదే సమయంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా త్రిభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తామంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప్రకటించింది. దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను సైతం గత యేడాది నవంబర్ 28న జరిపింది. చిత్రం ఏమంటే ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనుకుంటే… దీనికంటే ముందే ఈ యేడాది ప్రారంభంలో ‘సార్’ మూవీతో వచ్చాడాయన. గతంలో ధనుష్ నటించిన పలు చిత్రాలు తెలుగులో విడుదలై విజయం సాధించినా, అతని తొలి తెలుగు సినిమాగా ‘సార్’ నిలిచింది. వంద కోట్ల పైగా గ్రాస్ ను వసూలు చేసి ‘సార్’ సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. కానీ ధనుష్ నటించబోతున్న రెండో సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రం ఇంతవరకూ రాలేదు.
వరుసగా సినిమాలను నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ ఆ యా పనుల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఈ బ్యానర్ నుండి పాన్ ఇండియా మూవీ ‘మైఖేల్’ వచ్చింది. సందీప్ కిషన్ నటించిన ఈ సినిమా ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. సుధీర్ బాబుతో నిర్మిస్తున్న ‘మామా మశ్చింద్ర’ అతి త్వరలో విడుదల కానుంది. దానికి సంబంధించిన పబ్లిసిటీని కూడా మేకర్స్ మొదలెట్టారు. కానీ ధనుష్ తో తీయబోతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం విషయంలో మాత్రం పెదవి విప్పడం లేదు. ‘సార్’ సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ధనుష్ కాస్తంత గ్యాప్ తీసుకుని తన తదుపరి చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ మూవీ సెకండ్ షెడ్యూల్ లో ఆ మధ్య పాల్గొన్నాడు. గత యేడాది సెప్టెంబర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది ద్వితీయార్థంలో ఇది జనం ముందుకు వస్తుందని అంటున్నారు. ఇదే సమయంలో ధనుష్ 50వ చిత్రాన్ని తాము నిర్మించబోతున్నామంటూ ఆ మధ్య సన్ పిక్చర్స్ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలు శేఖర్ కమ్ముల మూవీ ఉంటుందా ఉండదా? ఒకవేళ ధనుష్ మూవీ ఉండకపోతే… శేఖర్ కమ్ముల ఎవరితో తన తదుపరి చిత్రం చేస్తాడనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది శేఖర్ కమ్ములే!
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!